నూతనంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గా చంద్రుడు నియామితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. గంధం చంద్రడు 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆధికారి. శిక్షణ అనంతరం తూ. గో. జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గాను ఐటీడీఏ పీఓగా పనిచేసి అక్కడి ప్రజల మననులు పొందారు. ఆ తర్వాత సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గాను  బాధ్యతలు చేపట్టారు. 2015 మార్చి తేదీన కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్గా నియామితులైనారు.2017 లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. 2019 జులై నుంచి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కో అపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్/ఎండిగాను పనిచేశారు.ఇప్పుడు ఆయన తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. అయితే అనంతపురం కలెక్టర్ సత్యనారాయణను ఎస్సీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here