అమరావతి : వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేశామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ విడతలో మొత్తంగా 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా గుర్తించామని వివరించారు. మొత్తంగా రెండు విడతలలో కలిపి ఇప్పటివరకు 2,36,340 మందికి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.దీనికోసం 230 కోట్ల రూపాయలు విడుదల చేశామని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది కొత్తగా ఎంతమంది లబ్దిదారులు వస్తే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని పేర్ని నాని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here