తమిళనాడు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.భారీవర్షాల నేపథ్యంలో శుక్రవారం విద్యాసంస్థలను కాంచీపురం, వెల్లూరు, చెంగల్పేట్ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు.దీంతోపాటు శుక్రవారం మద్రాస్ యూనివర్శిటీలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వర్శిటీ అధికారులు ప్రకటించారు.వాయిదా వేసిన పరీక్షను తర్వాత నిర్వహిస్తామని మద్రాస్ యూనివర్శిటీ అధికారులు చెప్పారు.గురువారం తిరువల్ల్వూర్ విశ్వవిద్యాలయం సర్కడు, కాట్పడిలో జరపాల్సిన పరీక్షలను డిసెంబరు 3వతేదీకి వాయిదా వేశారు.తమిళనాడులో శుక్రవారం భారీవర్షంతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.గత 24 గంటల్లో మీనంబక్కంలో 45 మిల్లీమీటర్లు, నుంగంబక్కంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here