చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరులో జిఎస్టి లైసెన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ  స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా) శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య( నాని)ని  కలిసింది. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, విజయవాడ ప్రెసిడెంట్ ఎం వి సుబ్బారావు, జనజ్వాల పత్రిక బ్యూరో డి.శ్రీనివాస్ లు తాడేపల్లి లోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో  మంత్రిని కలిసి  వినతి పత్రం సమర్పించడం జరిగింది.

అక్రిడిటేషన్లు మంజూరుకు ఎంపానెల్ మెంట్ తో సంబంధం లేకుండా అర్హత కలిగిన చిన్న పత్రికల జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, జీవో లోని షెడ్యూలు-ఎ లో పేర్కొన్న పత్రికల సైజులు, పేజీల అంశాన్ని చిన్న పత్రికల విషయంలో మినహాయింపు ఇస్తూ పాత విధానాన్ని కొనసాగించాలని కూడా మంత్రిని కోరడం జరిగింది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు విషయంలో జిఎస్టి మినహాయింపు అంశం పరిశీలిస్తామని, ఇంకా ఇతర అంశాలపై త్వరలో జర్నలిస్టులతో సమావేశమవుతామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here