ఎంతో కాలంగా అపరిష్కృతం గా ఉన్న బందర్ పోర్ట్ త్వరలోనే సాకారం కాబోతుంది. మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి చొరవతో కెనరా బ్యాంకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శంకర్ నారాయణన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సచివాలయం లోని ముఖ్య మంత్రి కార్యాలయం లో కలవడం జరిగింది. సదరు సమావేశంలో బందర్ పోర్ట్ ను ఏవిధంగా అభివృద్ధి చేయాలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.బందర్ పోర్ట్ కు సంబంధించి సమగ్ర ప్రణాళిక తాయారు చేయడం , రహదారులు నిర్మించడం, పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి గల అవకాశాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టడం, నిధుల సమీకరణ గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇందుకు అవసరమైన సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలను కెనరా బ్యాంకు వారి నుండి ఋణం రూపేణ పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
బందర్ ప్రాంత వాసుల చిరకాల కోరిక త్వరలోనే సాకారం కానున్నది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దూర దృష్టి తనకు చాలా నచ్చిందని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి తగు ప్రతిపాదనలు రాగానే బోర్డ్ నందు చర్చింది నిధులను విడుదల చేయడానికి తన వంతు కృషి చేస్తానని కెనరా బ్యాంకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శంకర్ నారాయణన్ తెలిపారు.మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యునిగా బందర్ పోర్ట్ నిర్మాణం కోసం పనిచేయడం, పోర్ట్ పనులు త్వరలోనే మొదలు పెట్టడానికి తన కృషి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎం.పి. బాలశౌరి తెలిపారు.