చంద్రబాబు ఇప్పుడు ఆచితూచి అడుగేయాల్సిన సమయమిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వం మీద చేసి విమర్శలు ప్రజారంజకంగా ఉండాలి కానీ తమ రాజకీయ అజెండాగా ఉండకూడని అంటున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తే తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి పురిటి స్నానపు ఛాయలు ఇంకా అరకముందే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు సైతం ఒప్పుకోవడం లేదన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు. పరిపాలన పరంగా జగన్ ప్రభుత్వం అన్నీ రాంగ్ స్టెప్స్ వేస్తుందని చద్రబాబు నిరూపించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని.. మరి ఐదేళ్లు పాలనలో చంద్రబాబు పీకిందేమీటని తనుకుతానే ప్రశ్నించుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా రాజధాని భూములు విషయంలో ఆయన చేస్తానన్న పర్యటన ఎంతవరకు సబుబని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకయిస్తుండడం రాష్ట్ర ప్రజలందరిని విస్తుపోయేలా చేస్తుంది.

ఎంతో ప్రశాంతగా ఉన్న రాజధాని ప్రాంత రైతుల మధ్య వైషమ్యాలు రగిలిచేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులను ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని ఇప్పుడు సడన్గా మొసలి కన్నీరు కారుస్తున్నాని మండిపడ్డారు. త్యాగరీతిలో రాజధాని కోసం భూములిస్తే.. చంద్రబాబు తన సొంత ప్రయోజనాలకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినఘణడని వారు దుయ్యబట్టారు. ఈ నెల 28 న అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని ప్రకటించిన చంద్రబాబుపై ఆ ప్రాంత రైతులంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి సమీపంలోని మొత్తం 29 గ్రామాల రైతులు సోమవారం సమావేశమైయ్యారు.        

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారకు చంద్రబాబ తమ ప్రాంతాలో పర్యటనను ఒప్పుకునేదిలేదని వారు తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో టీడీపీ నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ సమావేశలో  మాదల మహీంద్ర, బుర్రా వెంకటశివా రెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌, అలోకం సురేష్‌, కొయ్యగార వినోద్, బెజ్జం రాంబాబు,అరెపల్లి జోజి, రెహా్మన్, అక్కల లక్ష్మణరాయన రెడ్డి, మువ్వల కోటేశ్వరరావు, జొన్నల గడ్డ కిషోర్, చనుమోలు రామారావు, మేకల రవి, సవరం సురేంద్ర, అన్నూరు జక్కరయ్య తదితరులు   పాల్గొన్నారు.

కమీషన్లకు అడ్డా :
కమీషన్లకు అడ్డాగా రాజధానిని చంద్రబాబు, ఆయన మంత్రులు మలుచుకున్నారు. వారికి అనుకూలమైన కాంట్రాక్టర్లకే భవన, రోడ్ల అభివృద్ధి పనులు అప్పగించి. నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచి పెద్దమొత్తంలో కమీషన్లు కాజేశారు.  
– మేకల రవి, నెక్కళ్లు   

బెదిరించి భూములు లాక్కొన్నారు :

టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి భూములు ఇచ్చిన రైతుల్లో ఏ ఒక్కరినైనా పట్టించుకున్నారా? సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్లాట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 34 వేల మంది రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్కటి అయినా అభివృద్ధి చేశారా?

  – రమణారెడ్డి, రైతు, శాఖమూరు 

అసైన్డ్‌ భూములను కారుచౌకగా కొట్టేశారు:
రాజధాని పరిధిలోని మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో అసైన్డ్‌ భూములను కారుచౌకగా ఎవరు కొనుగోలు చేశారో అందరికీ తెలుసు. దళితులను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు.  నాలుగేళ్లలో  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడి వేల కోట్లు దోచుకున్నారు.

 – కొండేపాటి సతీష్‌చంద్ర, రైతు, మందడం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here