సీఎం జగన్ ను విమర్శించే స్థాయి లొకేషకు లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడతూ.. జైలులో ఉన్న చింతమనేని చూసేందుకు లోకేష్, మాజీ మంత్రి చింతమనేని చూసిరావడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. నరసరావుపేటలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

జగన్ పులిబిడ్డ

సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్ కు లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జగన్పై లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు. లోకేష్ తండ్రి చాటు కొడుకని, దొడ్డి దారిలో రాజకీయాలకు వచ్చిన వ్యక్తని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అసలు లోకేష్ వల్లే ఆ పార్టీ  భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ వాళ్లే విమర్శిస్తున్నా విషయం తెలుసుకోవాలన్నారు. జగన్ పులిబిడ్డని .. రాజశేఖర్ రెడ్డి పాలనను మళ్ళీ తెలుగు ప్రజలకు గుర్తుచేస్తున్నాడని జగన్ ను ప్రజలు కీర్తిస్తున్నారన్నారు.

Previous articleజగన్ దెబ్బకు బాబు విలవిల ..
Next articleనేటి నుంచి ఎపి రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here