ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని, ఎన్నికల ముందు జగన్ చెప్పటిన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేసున్నారని కొనియాడారు గణపతి సచ్చిదానంద స్వామి.ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా రాష్ర్ట  ప్రజల సంక్షేమానికి కృషి​చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు స్వామీజీ.జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.లోకకళ్యాణం, ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదవ రోజు సందర్భంగా ఒక ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్సార్‌ బాటలో జగన్‌ కూడా నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కుల పునురుద్ధరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం చాలా మంచి నిర్ణయమని, దీనిపై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు.ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలంతా ఇంగ్లీషులోనే చదివిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు.అంతేకాకుండా కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి కొంత సమయం కూడా ఇవ్వకుండానే ఇలాంటి విమర్శలు చేయడం మంచిపద్దతికా దన్నారు.అలాగే హిందూధర్మ పరిరక్షణ అన్నది ప్రతీ ఒక్క పౌరుని బాధ్యతని, దత్తపీఠం ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి తాము అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here