ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని వాటిని తప్పక నెరవేరుస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఆయన గురువారం భాధ్యతలు స్వీకరించి తదనతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా అనేక కార్యక్రమాలను అకాడమీ తరుపున చేపడతామని శ్రీనాధ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్, జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Previous articleవండర్ ఫ్రైడే..?
Next articleఎపీ కాంగ్రెస్ చీఫ్ గా మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here