వైసీపీ నేత జగన్ దారులన్నీ మూసుకుపోతున్నట్టు వారం రోజులుగా సాగుతున్న ప్రచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌ అవుతోంది. ఈ శుక్రవారం జగన్ రాజకీయ జీవితానికి కీలక మలుపు కాబోతోందని ప్రసార సాధానాలలో ఊదరగొడుతుండటం ఇక్కడ ప్రస్థావనార్హం.

గుంటూరు : వరుసగా రెండు శుక్రవారాలు జగన్ కోర్టు గుమ్మం తొక్కకపోవడంతో మూడో పర్యాయం కూడా గైర్హాజరు అయితే దాన్ని కోర్టు చాలా సీరియస్‌గా  పరిగణించవచ్చునని ఎల్లో గ్రూప్ మీడియా ప్రచారం. ఐతే, అదంత తేలిక కాదని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. రెండు వారాలు కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేసే అవకాశాలు సామాన్య నేరస్థుల విషయంలో సాధారణమే అయినప్పటికీ, ఒక ప్రభుత్వాధినేత విషయంలో కోర్టు అటువంటి ప్రభావాత్మక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇదంతా లోకేష్ అనుకూల సామాజిక మాధ్యమ ఉద్యమకారులు సాగిస్తున్న ప్రచారంగా వైసీపీ కొట్టిపారేస్తోంది.

సీబీఐ తరుఫు ప్రాసిక్యూటర్లు జగన్ బయటి సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం, దానికి కోర్టు నిరాకరించడం నేపథ్యంలో న్యాయమూర్తి ఇప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నది సాగుతున్న ప్రచారం. ఐతే, దీనికి ఎలాంటి లాజిక్ లేదు.

కోర్టు నిర్ణయాలు ఎలావుంటాయో అవగాహన కలిగిన నేతగా జగన్ ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని కూడా వైసీపీ వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. ఒకవేళ తన బెయిల్ రద్దు చేసిన పక్షంలో తన స్థానంలో తన సతీమణి వైఎస్ భారతిని కూర్చోబెట్టాలని జగన్ యోచిస్తున్నట్టుగా ప్రసార సాధానాల్లో, సామాజిక మాధ్యమాలలో వారం రోజులుగా వార్తలు ఊదరగొడుతున్నాయి. పాలనా వ్యవహరాలపై అవగాహన కల్పించేందుకు సలహాదారు అజయ్ కల్లామ్ నేతృత్వంలో తన అధికార నివాసంలో భారతికి తగిన శిక్షణ ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవమే లేదని అంటున్నాయి.

మొత్తం మీద రెండు వర్గాల మధ్య సామాజిక మాధ్యమాలలో ఒక చిన్న యుద్ధమే జరుగుతోందని చెప్పాలి. ఈ వార్‌తో శుక్రవారానికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here