ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుంచి చంద్రబాబు తీరు తేడాగా ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేరుశెనగ, మొక్కజొన్నపై తెలుగుదేశం చేస్తున్న విమర్శలు అర్థం లేనివని కొట్టిపారేశారు.మొక్కజొన్న కొనుగోలు కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.చంద్రబాబు హయాంలో మొక్క జొన్న రైతులకు బోనస్‌ ఇవ్వకుండా మోసం చేసి.. నేడు పచ్చి అబద్ధాలను ట్వీట్‌ చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు.రోజుకో దుష్ప్రచారంతో చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంమని, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను ఆయన  అమలు చేస్తున్నారని తెలిపారు.ఎక్కడా ఒక చిన్న అవినీతికి కూడా తావు లేకుండా రైతు ఖాతాలోనే నేరుగా పెట్టుబడి సాయం జమ అవుతుందని తెలిపారు.అంతేకాకుండా తొలిసారిగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని అన్నారు . అలగే దేవాదాయ భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా ఈ పెట్టుబడి సాయం వర్తిస్తుందన్నారు. రైతు భరోసా పధకం ద్వారా 45లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసామని, రైతులకు ఎక్కడ మద్దతు ధరకు ఇబ్బంది వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here