యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్‌ న్యూస్‌. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది రేపు (20,నవంబర్‌) రివీల్‌ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. అలాగే ప్రతినాయక పాత్రల సంబంధించి కూడా వివరాలు తెలియజేస్తామని తెలిపింది.ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తిచేసినట్టుగా యూనిట్ పేర్కొంది. 

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ భారీ మూవీలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం  పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌..,కొమరం భీంగా ఎన్టీఆర్‌.. నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది.  ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన  నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోనుంది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్‌ సరసన ఎవరు నటిస్తారనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌ సరసన నటిస్తారని పుకార్లు వచ్చాయి.. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎవరి పేరును ప్రకటించలేదు. ఎన్టీఆర్‌కు జోడీగా జక్కన్న ఎవరిని తీసుకొస్తారనేది రేపు తెలియనుంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  జూలై 30న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Previous articleఅక్రమ గుట్కా రవాణా
Next articleచంద్రబాబు X కన్నబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here