అమరావతి: వైసిపి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో అతిపెద్ద జిల్లా అయినా కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఒక విషయం సంచలనంగా మారింది.అదేమిటంటే రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ 90 శాతం మార్పు ఉంటుందని సిఎం జగన్ శాసనసభ పక్ష సమావేశంలోనే చెప్పేశారు.అయితే ఆ సమయం రావడానికి ఇంకా రెండేళ్లు ఉందనేది అందరికీ తెలిసిందే. అయితే ఒక కోయిల ముందే కూసిందనే సామెతలాగ కనబడుతోంది ఓ వ్యవహారం.నెక్ట్స్ కేబినేటులో ఎవరెవరు ఉంటారనేది ఊహకు కుడా అందనీ విషయం.కానీ కర్నూలు జిల్లాలోని గత ఎన్నికల్లో టిక్కెట్ మిస్ చేసుకున్న ఒక బిసి సామాజిక వర్గానికి చెందిన నేతకు కేబినేట్ బెర్త్ ఖారారు అయినట్లు జిల్లాలో సంచలనంగా మారింది.2021లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీతో పాటు 2022 లో కేబినెటులో మంత్రి అవుతారనేది దాని సారంశం.

వైసిపి సీనియర్ నేత, నాయకుల దశ దిశ మార్చగలిగే సత్తా ఉన్న ఓ అత్యంత ముఖ్యనేతను కర్నూలు జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇటీవలే కలవగా మాటల్లో మాటల్లో ఈ విషయం చెప్పరట.ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి బయటకు పాకి ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారిపోయింది.అంతేకాక ఆ నేత ముఖ్య అనుచరులు గత వారంలో ఓ హాటల్లో విందు కూడా అర్గించారనీ తెలుస్తోంది.ఇక ఆ నేతకు కలిసొచ్చే అంశాలు ఒకసారి చూస్తే వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా దగ్గరి పరిచయం, ఆ నేత సామాజిక వర్గం రెండు జిల్లాలో భారీగా ఉండటం మరియు ఆ సామాజిక వర్గానికే చెందిన ఓ నేత ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నందున నెక్ట్స్ మరో నేత లేకపోవడం, మరియు పార్టీలో, ప్రజల్లో గాని రవ్వంత కూడా వ్యతిరేకత, వివాదాలు లేకపోవడం, టిక్కెట్ రాకపోయినప్పటికి ఎన్నికల్లో పార్టీ జిల్లా అంతటా విజయదుందుభి మోగించటంలో కీలక పాత్ర పోషించటం వంటి అనేక అంశాలు ఆ నేతకు బాగా కలిసొస్తున్నాయి అంటున్నారు వైసిపి వర్గాలు.

Next articleలిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here