విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారికి అరుదైన అవకాశం లభించింది.ప్రతిష్టాత్మక మినిస్టరీ ఆఫ్ హౌసింగ్,అర్బన్ అఫైర్స్ కన్సల్టేటివ్ కమిటి సభ్యునిగా ఆయన నియమితులయ్యారు .ఆ శాఖా మంత్రి హరదీప్ సింగ్ పూరి చైర్మన్ గా వ్యవహరిస్తూ భారత ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేసింది. 14 మంది లోక్ సభ, 7 రాజ్యసభ సభ్యులతో ఈ కమిటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.అయితే వై ఎస్ ఆర్ పార్టీ నుంచి ఏకైక లోక్ సభ సభ్యలనుంచి విశాఖ ఎంపీ ఎంవీవీ ఈ కమిటి లో సభ్యునిగా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తమ అధినేత శ్రీ జగన్మోహనరెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి,మిధున రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్కి కేంద్రప్రభుత్వం నుంచి కేటాయించనున్న గృహాల సంఖ్య ,రాయితీల పెంపు తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ,రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here