మన పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని, సుమారు రెండు లక్షల ఉద్యోగాలకు గాను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతీ యేడు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుందని అయన నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ లో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో అయన ప్రసంగించారు.

రానున్న ఎన్నికల్లో మన ప్రభుత్వంఅధికారం చేప్పటడం ఖాయమని.. అధికారం లోకి రాగానే.. ప్రతీ గ్రామంలోను గ్రామ సచివాలయాలు నెలకొల్పుతామని… దాని ద్వారా అదే గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగ అవకాశం కల్గుతుందని… మొత్తంగా లక్ష యాబై వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో ప్రతీ యాబై ఇళ్ళకు ఒక వాలంటీర్ ను నియమించి వారికి నెలకి ఐదు వేలు జీతం ఇవ్వడం జరుగుతుందని జగన్ ప్రకటించారు.

ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ,బిజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలను నమ్మొద్దని… గత ఎన్నికల్లో మోసం పోయింది ఇక చాలని అయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా సాధనకు మనం కృషి చేద్దామని అయన ప్రజలకు పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం జిల్లలో అభివృద్ధి పనులుచాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని మనం పూర్తి చేసుకుందామని ప్రజలకు అయన హామీ ఇచ్చారు. వంశధార ప్రాజెక్ట్ పై పక్క రాష్ట్రము ఓడిశాతో సమస్య ఉందని.. ఏనాడూ కూడా చంద్రబాబు నాయుడు దానిపై పోరాటం చేయలేదని తెలిపారు.  ఆ ప్రాజెక్ట్ పనులు కూడా ఎవరికీ అప్పజెప్పారో తెలుసా?… అదే మన చంద్రబాబు నాయుడు బినామీ సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కంపెనీకి ఆ పనులు అప్పజెప్పారని .. అంతేకాక ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని మరో 470 కోట్లుకుపెంచేశారని.. పనులు మాత్రం ఒక్క అంగుళం కూడా  ముందుకు కదల లేదని తెలిపారు. వైఎస్సార్ పార్టీఅధికారంలోకి రాగానే అసంపూర్తి గా ఉన్న ఈ పనులు వెంటనే పూర్తి చేస్తానని హామీఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here