ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఈనెల 11 వ తేదీన జరగనుంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త రాజకీయాలకు మరోసారి తెరదీశారు. మైనార్టీలు, ఎస్టీ వర్గాలకు మంత్రి పదవులంటూ తాయిలాలు ప్రకటించడానికి సిద్దమయ్యారు. నాలుగున్నరేళ్లుగా ఎస్టీ, మైనార్టీలకు కేబినెట్‌లో చంద్రబాబు చోటు కల్పించలేని సంగతి తెలిసిందే. దీంతో ఆ వర్గాల నుంచి ..ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకోడానికే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఉదయం 11.30కు ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.

ప్రస్తుత శాసన మండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ షరీఫ్‌ని శాసన మండలి ఛైర్మన్‌గా చేయనున్నట్టు సమాచారం. అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించి టీడీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేగా ముడియం శ్రీనివాస్‌ మాత్రమే ఉన్నా, మంత్రి వర్గంలోకి ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభుత్వ విప్‌, వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ‌్‌ని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here