వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించాలని వైసిపి యేచిస్తుంది.అయితే ఆ వార్త వింటున్న వైసిపి నేతలకు మాత్రం గుండేలలో గుబులు పట్టుకుంటుంది.రాష్ట్రంలో ఎలా ఉన్నా, వైసిపికి కంచుకోట అయినా కర్నూలు జిల్లాలో మాత్రం అంతగా తలనొప్పి తెప్పించే విషయం అయితే లేదు.దీంతో మరొసారి రెండు ఎంపి, 11 – 13 ఎమ్మెల్యే స్థానాలను వైసిపి కైవసం చేసుకోబోతున్నట్లు వివిధ తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక అభ్యర్థుల విషయానికొస్తే కర్నూలు జిల్లాలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మరియు వైసిపి సినీయర్ నేతలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నా అభ్యర్థులు అయితే వీరే.ఇక అభ్యర్థుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబానికి కంచుకోట అయి, విశేష ప్రజాదరణ ఉన్న కర్నూలు పార్లమెంటు, గత 15 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానికి గెలుపు వరిస్తూ వస్తుంది.ఇక్కడ ప్రస్తుతం పార్లమెంట్ ఇంచార్జుగా బి.వై రామయ్య ఉన్నారు.బిసి సామజిక వర్గానికి చెందిన ఈయనకు బిసిలలో దళితులలో వివిధ సామాజిక వర్గాలలో మంచి పట్టుంది.ఎలాగో ఇది వైసిపి గెలిచే స్థానమే కనుక అభ్యర్థి మీద ప్రజాదరణ లేకపోయినా ఇబ్బంది లేదు గానీ, వ్యతిరేకత అయితే ఉండకూడదనేది జగమెరిగిన సత్యం.ప్రజాదరణ లేకపోయినా, వ్యతిరేకత లేకపోవడంతో గతంలో బుట్టా రేణుక విషయంలో నిరుపితమైంది. బి వై రామయ్య మీద ఎటువంటి వ్యతిరేకత ఎలాగో లేదు.ఇంకా ఆయనకు మంచి ప్రజా ఆదరణ ఉండటంతో గెలుపు చాలా సులువుగా నెగ్గవచ్చనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితమే వైసిపి ఆయనకు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది.అప్పట్లి నుంచి ఆయన పార్లమెంటు వ్యాప్తంగా చురుగ్గా, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దూసుకోపోతున్నారు.ఆయనకు పోటీ కూడా ఎవరు లేకపోవడంతో, వైసిపి కర్నూలు ఎంపి అభ్యర్థి బి.వై రామయ్యనే అని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక నంద్యాల ఎంపి అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తోంది.కొత్త నేతలు యత్నాలు చేస్తుండటంతో తర్వాత దానిని ప్రకటిద్దామని వైసిపి భావిస్తోంది.ఎమ్మెల్యేల విషయానికొస్తే పత్తికొండ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని ఇప్పటికే జగన్ ప్రకటించారు.ఆలూరు ఆదోని మంత్రాలయం నందికొట్కూరు డోన్ నియేజకవర్గాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళనే బరిలో దింపనుంది.ఆత్మకూరు ఆళ్ళగడ్డ బనగానపల్లె ఎమ్మిగనూరు నియేజకవర్గాలలో ప్రస్తుతం ఇంచార్జుగా ఉన్న వాళ్ళనే పోటి చేయించనుంది.ఇక మిగిలిన కర్నూలు కోడమూరు పాణ్యం నియేజకవర్గాల గురించి ఇప్పటికైతే స్పష్టత లేదు.కర్నూలు కోడుమూరు నియేజకవర్గాలలో ఇంచార్జులనే బరిలో దింపేందుకు వైసిపి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.అయితే పాణ్యం నియేజకవర్గం మాత్రం వైసిపికి కత్తమీద సాములా మారింది. ఆ నియేజకవర్గ అభ్యర్థి ఎవరో చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి.

ఏది ఏమైనప్పటికి కర్నూలు జిల్లాలో ఒక ఎంపి మరియు ఎమ్మెల్యేల అభ్యర్థులు దాదాపు ఖారారు అయ్యారనే సమాచారం.కానీ ఎమ్మెల్యే ఎంపి అభ్యర్థులు ఒకేసారి ప్రకటిద్దామా లేదా అనేది ఆ పార్టీ ఆలోచిస్తుంది.ఒకేసారి అన్ని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఒకేసారి ఉత్సాహం నింపటం కన్నా ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించి బస్సు యాత్ర లేదా జిల్లా పర్యటనలో ప్రకటిస్తే మరొసారి ఉత్సాహం నింపవచ్చనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here