-ఈ మధ్య జరిగిన 6 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నా విశ్లేషణ మిజోరాం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ 7 శాతము ఓట్ల తేడాతో ఓడిపోయింది. మిజోరాం నేషనల్ ఫ్రంట్ కు 26 సీట్లు (37 .6 శాతం ఓట్లు) వస్తే కాంగ్రెస్ కు 5 సీట్లు (30 .2 శాతము ఓట్లు) గెలిచింది

తెలంగాణాలో లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ , TDP TJS CPI తో ‘మహా కూటమి’ పేరుతొ జత కట్టినా TRS చేతిలో ‘మహా ఓటమి’ చవి చూసింది.

ఇక 15 సంవత్సరాలుగా అధికారం లో ఉన్న ఛత్తీస్ గఢ్ లో అధికార బీజేపీ 10 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ కు 68 సీట్లు (43 శాతము ఓట్లు) , బీజేపీ కి 15 సీట్లు (౩౩ శాతము ఓట్లు) వచ్చాయి.

ఇక 5 సం లుగా BJP అధికారం లో ఉన్న రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 99 సీట్లు(39 .3 శాతం ఓట్లు) వస్తే బీజేపీ కి 73 సీట్లు (38.8 శాతము ఓట్లు) వచ్చాయి అంటే కేవలం 0 .5 శాతం ఓట్లతో ఓడింది .ంటే వెయ్యి ఓట్లలో కాంగ్రెస్ కు 5 ఓట్లు ఎక్కువచ్చాయి అన్నమాట. ఇక్కడే BJP ని మెచ్చుకోవాల్సింది , ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయింది బీజేపీ. పైగా ఇక్కడ రాజస్థాన్ లో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే ఇంకో సారి BJP గెలుస్తుంది , ఇది గత 30 సం లుగా జరుగుతుంది.

15 సంవత్సరాలుగా బీజేపీ అధికారం లో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 114 సీట్లు (40 .9 శాతం ఓట్లు) వస్తే BJP కి 109 సీట్లు( 41 శాతం ఓట్లు) వచ్చాయి అంటే హంగ్ ఏర్పడింది . కాంగ్రెస్ కంటే 0 .1 శాతము ఓట్లు ఎక్కువ వచ్చాయి బీజేపీ కి .
15 సం లు బీజేపీ అధికారం లో ఉండడం ఒక గొప్ప అయితే 0.1 శాతము ఎక్కువ ఓట్లు తెచ్చుకొని ఓడిపోవడం విశేషం . ఈ విషయం లో మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ను అభినందించాలి

ఇక ఈ సంవత్సరం మే 12 న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 80 సీట్లు తెచ్చుకొని ఓడిపోగా BJP 105 సీట్లు తెచ్చుకొని నైతికంగా గెలిచింది కానీ బీజేపీ ని అధికారం లోకి రాకూడదని 37 సీట్లు తెచ్చుకున్న JDS కు మద్దతిచ్చి కాంగ్రెస్ అక్కడ కుమారస్వామిని CM ని చేసింది

అంటే అధికారం లో ఉన్న కర్ణాటక మిజోరాం లో కాంగ్రెస్ ఓడిందీ , ఛతీస్ గఢ్ లో 15 సం తరువాత బీజేపీ ఓడిందీ మధ్య ప్రదేశ్ రాజస్థాన్ లో అయితే నువ్వా నేనా అన్నటుగా సాగింది కాంగ్రెస్ బీజేపీ మధ్య. తెలంగాణ లో సోది లోకి లేకుండా లేకుండా పోయాయి కాంగ్రెస్ బీజేపీ లు

దీన్ని బట్టి తేలిందేమిటంటే రాహుల్ ను చూసి మోడీని చూసి ఓట్లు వేయలేదు ప్రజలు, ఆయా స్థానిక ప్రభుత్వాల ముఖ్యమంత్రుల పని తీరు ఆధారంగానే ఓట్లు వేస్తున్నారు ప్రజలు

మోడీ రాహుల్ ను చూసి ఓట్లు వేసే వారు చాల తక్కువ నిజంగా రాహుల్ హవా ఉంటె కర్ణాటక తెలంగాణ మిజోరాం లలో కాంగ్రెస్ ఎందుకు ఓడింది? అలాగే మోడీ హవా కూడా లేదు.ఇంకో విషయం రాను రాను MLA MP అభర్ధులను చూసి ఓట్లు వేయడం కూడా బాగా తగ్గుతోంది.కేవలం పార్టీ ,ముక్యమంత్రి, కులం,డబ్బు ఆధారంగానే ఓట్లు వేస్తున్నారు.

-CVReddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here