దేశవ్యాప్తంగా  సంచలనం కల్గిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రధాని మోడీకు ఊరట నిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాని మోడీని దోషిగా పరిగణిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు ఇవాళ కొట్టివేయడం ప్రధానితో పాటు…బీజేపీ ప్రభుత్వానికి ఉపశమనంగా మారింది. 

ఈ కేసు దేశ రక్షణకు సంబంధించినదైనందున తాము జోక్యం చేసుకోజాలమని కోర్టు అభిప్రాయపడింది. యుద్ధ విమానాల ధరల అంశాన్ని నిపుణుల కమిటీ చూసుకుంటుందని చెప్పిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ….పిటీషన్ ను కొట్టివేసింది.  పిటీషన్ ను కొట్టివేయడాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పబట్టారు. కేసు పూర్వాపరాల్ని పూర్తిగా పరిశీలించకుండానే కోర్టు ఇచ్చిన తీర్పు సరైందికాదన్నారు. 

కాగా…ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మోడీను, బీజేపీను ఇరుకునపెట్టాడానికి మంచి ఆయుధంగా మల్చుకుంది. అవకాశమున్న ప్రతి చోటా బీజేపీ మరియు మోదీపై విమర్శలు సంధించింది. ఇప్పుడు తీర్పు బీజేపీకు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిందనే చెప్పాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here