సర్వేల విషయంలో లగడపాటి రాజగోపాల్ పై ఇప్పటివరకు కొంత విశ్వాసం ఉండేది. వివిధ ఎన్నికల్లో ఆయన అంచనా వేసిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. ఇక తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఎన్నికలకు ముందు రోజు ఏదో వ్యూహంతో ప్రజాకూటమిదే విజయమని చెప్పారు. ఎన్నికలు ముగిశాక అన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని చెప్పగా… లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పారు.

సర్వేను నమ్మి కోట్లలో బెట్టింగ్….

దీంతో లగడపాటిని నమ్మి పెద్దఎత్తున ప్రజాకూటమి గెలుస్తుందని బెట్టింగులు పెట్టారు. ఆంధ్రాలో టీడీపీకి అనుకూలంగా ఉండేవారు ఇలా ఎక్కువగా ప్రజాకూటమిపై బెట్టింగ్ లు కట్టారు. ఫలితాలు పూర్తిగా తారుమారై టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇక కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని గెలుస్తుందని, కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుస్తారని బెట్టింగులు పెట్టిన వారు సైతం నిండా మునిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here