తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఓటమిపాలయ్యారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ 6009 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ ఏకంగా రాహుల్ గాంధీతో కలిసి మొదటిసారిగా చంద్రబాబు బహిరంగ సభ వేదిక పంచుకున్నారు. ఆ సభను చారిత్రక సభగా కూడా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇక టీడీపీ మరింత ప్రతిష్ఠాత్మకంగా భావించిన కూకట్ పల్లిలోనూ టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఓటమి అంచున ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ కేవలం అశ్వరావుపేట, సత్తుపల్లి స్థానాల్లో మాత్రం ఆధిక్యతలో ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here