చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రము అనాధగా మారిందని, తన సొంత రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని సైతం తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని విభజన తర్వాత తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కృష్ణారావు అన్నారు. ఆయన ‘నవ్యాంధ్రతో నా నడక’ అనే పుస్తకాన్ని అయన రచించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… చంద్రబాబు ఓటుకు నోటు కేసుతో రాష్ట్ర భవిష్యత్తు తలకిందులైదని అయన ఆ బుక్ లో పేర్కొన్నారు. దానివల్లే ఆయన బలహీన పడి, గొంతు జీరబోయి, బతుకు జీవుడాని హైదరాబాద్ నుంచి విజయవాడ పరిగేట్టుకుంటూ వచ్చేసారని తెలిపారు.దీనివల్లే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత హైదరాబాద్‌లోనే ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని చెప్పిన ఆయన… తెలంగాణలో ఉంటూ కేసీఆర్‌ సర్కారును దెబ్బతీసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్ని అడ్డంగా దొరికిపోయారు. అదే సమయంలో ఓటుకు నోటు వ్యవహారం బయటపడడంతో.. పెట్టి సద్దుకుని  బతుకు జీవుడా అంటూ విజయవాడకు వచ్చి వాలారని. అప్పటి నుంచి హైదరాబాద్‌కు వెళ్లడం కూడా తగ్గించేశారు.

విజయవాడలో రాజధాని నిర్మాణం గురించి భారీ ఎత్తున ప్రచారం మీడియా చేసి, ఒక ఊపు సృష్టించి, దానిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో బిల్డప్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో ఉండలేని పరిస్థితిని కప్పిపుచ్చుకొనేందుకు విజయవాడలోనే ఉండిపోవడానికి తాత్కాలిక రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. వీటన్నిటికి తన అనుకూల పత్రికలూ ఎలాగు ఉన్నయి. దాంతో ప్రతికూల పరిస్థితిని తన సొంత మీడియా సహాయంతో అనుకూలంగా మలుచుకున్నారు. ఇలాంటివన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.క్షేత్ర స్థానంల్ నుంచే పరిపాలన ఉత్తమం అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి… వీర లెవెల్లో ప్రచారం చేశారు. ఇదంతా ఓటుకు నోటు కేసు మహత్యమేనని వేరే చెప్పనక్కరలేదు.

నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆయనకు పంపిన ఏ ఫైల్ కూడా తిరిగి నాకు వచ్చేది కాదు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం స్వయంగా ఆ సమయంలో నేను చూశాను.ఈ కేసుతోనే కేంద్ర ప్రభుత్వం దగ్గర మనపై చులకన భావం ఏర్పడింది.చంద్రబాబు హడావిడిగా మకాం విజయవాడ మార్చడంతో సచివాలయ ఉద్యోగులు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు.వారి కోసం ఏమాత్రం ఆయన కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకపోవడం చాలా భాదేసిందని ఐవైఆర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here