ప్రచారంలో నువ్వా..నేనా

తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ నాయకులతో చర్చిస్తూ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు టీ.టీడీపీ ప్రముఖ నేతలతో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు ఉన్నప్పటికీ గెలుపు అన్ని నియోజకవర్గాల్లో ఉండాలని చంద్రబాబు సూచిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామానికి సమయం అసన్నమవ్వడంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ప్రచారంలో నువ్వా..నేనా అంటూ దూసుకువెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుండటంతో…ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణ టీడీపీ నేతలతో ఫోన్ టచ్‌లో ఉంటూ గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. టిక్కెట్లు రాని నేతలను బుజ్జగించడం.. నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించటం వంటి అన్ని బాధ్యతలను అమరావతి నుండే పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు.
• టీటీడీపీ నేతలతో ఫోన్‌లో టచ్‌
• గెలుపు వ్యూహలు అమలు
• టికెట్లు రాని నేతలను బుజ్జగించడం
• నేతలకు ప్రచార బాధ్యతలు
• అమరావతి నుంచే పర్యవేక్షణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేది 13 స్థానాలే అయినప్పటికీ… ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 13 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు పలు సూచనలు చేస్తున్నారు. టీటీడీపీ ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ…ఎవరెవరిని ప్రచారానికి పంపించాలి..నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు ఏంటి ….ప్రత్యర్థుల బలం, బలహీనతలు ఏంటనేదానిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక తెలంగాణ ప్రాంతంలో ప్రభావం చూపగల ఆంధ్ర నేతలను ప్రచారానికి పంపించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు…. పెద్దగా హడావుడి లేకుండా ప్రచారం చేయాలని సూచనలు చేస్తున్నారు.
• టీడీపీ పోటీ చేసేది 13 స్థానాలు
• 13 నియోజకవర్గాల రిపోర్ట్స్
• టీటీడీపీ ముఖ్యనేతలకు ఫోన్‌
• ఎవరెవరిని ప్రచారానికి పంపించాలి
• నియోజవర్గాల్లో స్థానిక పరిస్థితులు
• ప్రత్యర్థి బలం, బలహీనతలు
• తెలంగాణలో ప్రభావం చూపగల ఆంధ్రనేతలు
• హడావుడి లేకుండా ప్రచారం
ఇప్పటివరకు అమరావతి నుండి హైదరాబాద్‌కి డైరెక్షన్ ఇచ్చిన బాబు….కేసీఆర్‌ను నేరుగా ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి రెండు రోజుల పాటు తెలంగాణలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here