breakinguru.com
puri new movie

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాద్ షాట్ గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం హీరో రామ్ తో మొదలుపెట్టనున్నాడు. పూరీ స్టైల్ కి రామ్ ఎనర్జీ తోడైతే అది లెక్కలో ఉంటుందో అప్పుడే ఉహించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకొని వస్తున్న సినిమా కావడంతో మంచి కసితో ముందుకు వస్తున్నాడు పూరి.పైగా తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.    

ఈ చిత్రాన్ని 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు పూరి. అయన భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here