పుడమ తల్లి పరవిసించి పలకరించే… రోజు ఇది:
శ్రుతిని పల్లవించే గొంతుతో యావత్
భారాతవని ని ఊలలాడించే మన
గానా గంధర్వడు శ్రీ S.P. బాలసుబ్రహ్మణ్యం గారు కేరింతలు
పెట్టిన రోజు ఇది. దేశ భాషలు అన్ని
బాలు పాట తో పరవసించాలని పరితపిస్తూ ఉంటాయి.
ఏ కథానాయకుడికి తన గాత్రం ఇచ్చిన
ఆ నాయకుడే పాడుతున్న అనుభూతి
కలిగించడలో సిద్ధహస్తుడు మన బాలుడు.వారి శారీరక భాష ని గ్రహించి
దానికనుగుణంగా పాటని అందించే
స్వర మేధావి. ఆత్రేయ గారు అన్నట్టు
బాలు ఫీలై పాడితే… మిగతా వాళ్ళు
పడడానికి ఫీల్ అవుతారు. గాయకుడిగా, సంగీత దర్శకుని గా
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాల
పాత్రలను తనదైన శైలిలో తెర వెనుక
తెర ముందు సమర్ధవంతంగా పోషించిన ఈ కళ్ళామ్మ తల్లి తన
ముద్దు బిడ్డను చూసి మురిసిపోయి
మైమరచి తన గొంతు లో మాధుర్యాన్ని
ఈ సృష్టి ఉన్నంత వరకు ఆస్వాదిస్తూ
ఉంటుంది. ఇన్ని వైవిధ్యభరితమైన
పాత్రలు పోషిస్తూ…ఈ నాటి వర్ధమాన
గాయనీ గాయకుల ను అభివృద్ధి పథంలో కి తీసుకు రావాలనే తపన, ఉత్సాహం తో పాడుతా తీయగా అంటూ…ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభను
వెలికితెసే కార్యక్రమంలో స్వర సైనికుడి
పాత్ర పోషిస్తున్న మన బాలుడికి
భగవంతుడు చిరాయువు నిచ్చి…
తన గొంతు నుండి ఇంకా ఎన్నో
ఆణిముత్యాలు మనకు అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ…….
బాలు గారికి హృదయ పూర్వక……..
జన్మదిన శుభాకాంక్షలు.
💐💐💐💐💐💐💐💐💐💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here