జనసేన అధినేత అధినేతపై మండిపడ్డారు వైస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ మండిపడ్డారు. సినిమాల్లోగా రాజకీయాలో కూడా నటిస్తే కుదరదని అన్నారు. మంగళవారం అయన హైదరాబాద్లో విలేకరుల సమావేశంల్ మాట్లాడుతూ… వై యస్ రాజశేఖర్ రెడ్డి పాలనపై మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు ఎక్కడదని రెహమాన్ ప్రశించారు. పవన్ కళ్యాణ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. ఆయన్ను పిచ్చి ఆసుపత్రికి వెంటనే తరలిస్తే మంచిదని అన్నారు. సభల్లో ప్రసంగించడం అంటే నోటికి వచ్చింది మాట్లాడం కాదని..నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రెహమాన్ సూచించారు.

కాబోయే సీఎం జగన్ … ఇది పక్కా ..!

అధికార పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, అన్యాయాలపై నిలదీయడంమానీ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ పై విమర్శించి స్థాయి పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. మీ పార్టనర్ చంద్రబాబు ఆంధ్రలో దోచుకున్న అవినీతి సొమ్మును తెలంగాణాలో ఖర్చు పెడుతున్నారన్న విషయం మీకు తెలియదా .. అది తెలుగుదేశం నాయుకుల ఇళ్ళలో నగదు దొరుకుతోందని తెలిపారు. ప్రజలు ప్రజా కూటమి, బీజెపీ లను నమ్మి మోసపోవద్దని.. ఆంధ్రప్రదేశ్ లో మన జగన్ నేతృత్వంలో స్వర్ణ యుగం రాబోతుందని అయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here