నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి…వ్యతిరేకిస్తారా…
కర్నాటక కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలి నిర్ణయంపై మహిళల మండిపాటు..
నో లిప్ స్టిక్ …నో స్లీవ్ లెస్…నో స్కర్ట్స్…

హుందాగా డ్రెస్సింగ్ చేసుకోమన్నా మహిళలకు అభ్యంతరమైపోయిందిప్పుడు. సినిమాల్లో..ప్రకటనల్లో కన్పించే స్లీవ్ లెస్ డ్రెస్సెస్,స్కర్ట్స్ ని మండిపడే మహిళలు…నిజజీవితంలో వాటిని స్వాగతిస్తున్నారా… అవుననే అన్పిస్తోంది. నిర్ణయం మంచిదైనప్పుడు స్వాగతించాల్సింది పోయి..వ్యతిరేకిస్తున్నారు.

కర్నాటక కాంగ్రెస్ కేపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొత్తగా పుష్ప అమర్ నాథ్ ఎంపికయ్యారు. బాధ్యతలు స్వీకరిస్తూనే ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా…స్లీవ్ లెస్ డ్రెస్సులు…స్కర్టులు వేసుకోకూడదని…లిప్ స్టిక్ పెట్టుకోవద్దని నిషేదాజ్ఞలు జారీ చేశారు. హుందాగా బ్లూ కలర్ శారీలు మాత్రమే ధరించాలని..బ్లౌజ్ మెడ వరకూ పూర్తిగా ఉండాలని అన్నారు. ఇది నిజంగా మంచి నిర్ణయమే. ఓ మహిళను ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మహిళ గౌరవాన్ని పెంచే డ్రెస్ కోడ్ ఇది. అయితే ఇది ఆ
మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమెపై మండిపడుతున్నారు. హుందాతనాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు కోరుకుంటుంటే….కార్యకర్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కాని విషయమే. డ్రెస్ కలర్ విషయంలో అభ్యంతరం పెడితే బాగుంటుందేమో కానీ…చక్కగా హుందాగా ఉండమంటే ఎందుకు అభ్యంతరమో వీరికి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here