తన భర్తను ఎందకు అరెస్ట్ చేశారో ? ఎక్కడికి తీసుకెళ్ళారో తెలపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య డిమాండ్ చేశారు.తన భర్త పట్ల పోలీసులు వ్యవరించిన తీరుపై రేవంత్ రెడ్డి భార్య గీత తప్పుపట్టారు.అసలు ఎందు అరెస్ట్ చేశారో కూడా తమకు తెలపలేదని ఆమె వాపోయారు. ఒక తీవ్రవాదిని తీసుకెల్లినట్లు తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు కాస్త సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇది కోడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడని… నియంత పాలనకు అడ్డుకట్టవెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి వికారాబాద్‌ జిల్లాలోని కోస్గిలో కేసీఆర్‌ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేవంత్తో పాటు అయన సోదరుడు కొండల్‌ రెడ్డి,అయన అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనితో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here