త్వరలో తేలిపోనున్న అసలు కుట్రదారులు..సూత్రధారులు

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. హత్యాయత్నం ఎయిర్ పోర్ట్ లో ఆవరణలో జరిగినందున ఈ కేసును సివిల్ ఏవియేషన్ చట్టం ప్రకారం కేంద్ర దర్యాప్తు బృందమే విచారణ చేయాలనీ స్పష్టం చేసింది హైకోర్టు. సెక్షన్ 6 ప్రకారం ఈ కేసును కేంద్రమే స్వయంగా ఎందుకు తీసుకోకూడదంటూ గతంలో హైకోర్టు ఆదేశించింది.దీనికి సంభందించి రెండు మూడు  వాయిదాల అనంతరం శుక్రవారం తుదితీర్పును వెలువరించింది.

సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ఏజెన్సీ పరిధిలోకి

సివిల్ ఏవియేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం కచ్చితంగా కేంద్ర పరిధిలోకే వస్తుంది కాబట్టి కేసును ఎన్ ఐ ఏ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. హైకోర్టు తీర్పు ప్రకారం నేటి నుంచి జగన్ పై హత్యాయత్నం కేసు పూర్తిగా ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లిపోనుంది. రాష్ట్ర పోలీసులు ఈ కేసు నుంచి ఇక తప్పుకోవల్సిందే.

తేలనున్న అసలు కుట్రదారులు

ఏపీ పోలీసులు కావాలనే ఈ కేసును తప్పదోవ పట్టచారనడానికి అనేక ఆధారాలున్నాయి. హత్యాయత్నం జరిగిన రోజే సెక్షన్ 3 ప్రకారం కేసు బుక్ చేసి ఉంటే..దానిని షెడ్యూల్ ఆఫెన్స్ గా పరిగిణించి , సెక్షన్ 6 ప్రకారం అప్పుడే ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లిఉండేది. కానీ అలా జరగలేదు. అసలు నేరస్థులను, దోషులను కాపాడే ఉద్దేశ్యంతోనే ఏపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసి తప్పించుకొనే ప్రయత్నాలు చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. మరోవైపు పోలీసులు ఈ కేసును ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తున్నారని.. నేరస్థులను కాపాడేందుకు సర్వవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని .. దీనితో వారు ఐపీసీ సెక్షన్ 166 ప్రకారం వారు శిక్షార్హులని పిటీషనర్ తరపు లాయర్లు కోర్టు ముందు తమ వాదనలు వినిపించగా… దీనిపై కోర్టు విచారణ కొనసాగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here