పెథాయి  తుఫాన్ దెబ్బకు విశాఖ ప్రజలు చలితో వణికిపోతున్నారు. తుఫాన్ తీరం దాటి ఉరటనిచ్చినా, చలి తాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు సోమవారం విశాఖ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర రవాణ శాఖా తమ సర్వీసులను రద్దు చేసింది. అలగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి, జుమోటో కూడా తమ సర్వీసులను నిలిపివేసింది. తుపాన్ తీరం దాటడంతో వర్షం తగ్గుముఖం తగ్గినా.. చలి ప్రభావం మాత్రం ప్రజలును ఇబ్బంది పెడుతుంది. చలి ప్రభావంతో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం విశాఖ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే చీకటి అలుముకొంది.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here