ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబును ఢిల్లీ లో పట్టించుకునేవారే ఉండరని అన్నారు బిజెపి ఎంపీ జి వి ఎల్ నరసింహరావు. కేంద్రంలో కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం వచ్చే పరిస్థితి అస్సలు లేదని వారికి స్పష్టంగా అర్థమైందన్నారు. అవినీతితో సంపాదించినా సొమ్ముతో ఇతర పార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఆయన.
ఒక వైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడితే… మన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పులు అరిగేలా ఢిల్లీ లో అన్ని గుమ్మాలు తొక్కుతూ తన వంతు కృషి చేస్తున్నారని, కాకపొతే ఆయనే తెలుసు ఈ నెల 23 తర్వాత చంద్రబాబు నాయుడ్ని కలవడానికి కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపించారని .. ఎందుకంటే సొంత రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికారం అయన చేతుల్లోంచి జారిపోయిన తర్వాత లోక్ సభలో కూడా తెలుగు దేశం పార్టీకి సరైన మెజారిటీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు.
కాబట్టి ఈ నెల 23 తర్వాత రాజకీయాల్లో సరైన పాత్ర పోషించలేని కారణంగా అయన ముందుగానే అందరితో కలిసి ఫోటోలు తీయుంచుకుంటున్నారు తప్ప ఈ పర్యటనల వలన ఆయనకు గాని , తెలుగు దేశం పార్టీకి గాని ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు తన అవినీతి సొమ్ముతో అనేక ప్రతి పక్ష పార్టీల సాన్నిహిత్యాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్టంలో అయన అడ్డగోలుగా సంపాదించినా అవినీతి సొమ్ముతో కేంద్రం లో చక్రం తిప్పాలని చూస్తున్నారని అయన ఎద్దేవా చేశారు. వీటన్నికి అనేక రుజువులు కూడా మా దగ్గర ఉన్నాయని అయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లోనే వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా అధ్వాన్నంగా ఉండడం వాళ్ళ దురదృష్టం అని జి వి ఎల్ అన్నారు. ఎట్టిపరిస్తుతుల్లోనూ తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రాదని అయన తేల్చి చెప్పేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా పూర్తీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని .. అది చంద్రబాబు కూడా తెలుసుకోవాలిని ఆయన అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలు వలన ఏమి ఒరిగేది లేదని జివిఎల్ నరసింహ రావు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here