నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కు కాంగ్రెస్ పార్టీ కీలక పదవినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి బండ్ల గణేష్ కు పీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.బండ్ల గణేష్ ఇటివల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.. అయితే అయన షాద్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అధిష్టానం షాద్ నగర్ టిక్కెట్  ప్రతాప్ రెడ్డి కి కేటాయించింది.దీంతో బండ్ల గణేష్ అసంతృప్తి కి లోనైయారు. కాంగ్రెస్ పార్టీ బండ్ల ను బుజ్జగించే పనిలో భాగంగా ఆయనకు పీసీసీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చి శాంతిపరచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here