కర్నూలులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంటే తెలియని వారుండరు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కర్నూలు లోక్ సభ నుంచి పోటి చేసేది ఆయనే అని చెప్పొచ్చు.మరీ అలాంటి నాయకుడిని ఢీ కొట్టేందుకు వైసిపిలో ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి.వైసిపి నేతలు కనీసం ఆయనను విమర్షించిన దాఖలాలు కుడా లేవు.అయితే ఇప్పుడు ఆయనకు పోటిగా జగన్ భారిగానే స్కెచ్ వేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కోట్లతో కలిసి పనిచేసి రాజకీయంగా నలిగిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలను వదిలేసుకొని, అధికారంలో ఉండి కుడా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం పనిచేసి‌, ఎప్పుడో రావాల్సిన డీసీసీ పదవిని ఎంతో ఆలస్యంగా‌ పొంది, రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులు ఎద్కొంటున్న సమయంలో డీసీసీ పగ్గాలు చేపట్టి పార్టీని కాస్త గట్టెక్కేంచి, తర్వాత వైసిపిలో చేరిన బి.వై రామయ్యను జగన్ సిద్ధం చేస్తున్నారు.

దాంట్లో భాగంగా ఆయనకు ఇప్పటికే లోక్ సభ ఇంచార్జ్ ఇవ్వడమే కాకుండా, ఎంపి అభ్యర్థి కుడా దాదాపు ఖరారు చేసారు.దీంతో బి.వై రామయ్య కర్నూలు పార్లమెంటులో విస్తృతంగా పర్యటిస్తూ, వ్యూహాత్మక అడుగులు వేస్తు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ‌‌, తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు.ఇక బుధవారం బి.వై రామయ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో వైసిపిలో చేరి రెండు సంవత్సరాల తర్వాత తొలిసారిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడారు.దీంతో కర్నూలు జిల్లా అంతటా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం డోన్ పట్టణంలో జగన్ ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాలేడనీ చెప్పిన కోట్ల తీరును బి.వై రామయ్య తప్పుబట్టారు.కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిస్తే, కాంగ్రెసుకు వచ్చే రెండు మూడు సీట్లలో మీకు కూడా ఎంపి టిక్కెట్ వస్తాదనీ ఆశతో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సరి కాదన్నారు.గతంలో టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దనీ సూచించారు.

అదేవిధంగా టీడీపీ కాంగ్రెసుతో కలిస్తే ఊరేసుకుంటాననీ చెప్పిన డిప్యూటీ సీఎం కే.యి కృష్ణమూర్తి గారికి తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటి చేస్తున్నది, రాహుల్ గాంధీ చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తున్నది కనబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రజల మద్దతు వైఎస్సార్ సిపికే ఉందనీ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సిపి విజయఢంకా మోగిస్తుందనీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here