తెలంగాణా ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నిజాయితీతో కూడిన తీర్పునిచ్చారని.. అపవిత్ర పొత్తుపై వారి అభిప్రాయాన్ని ఓటు గుద్ది చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజసంకల్ప్ యాత్రలో భాగంగా అయన ఆముదాలవలస బహిరంగ సభలో మాట్లాడుతూ… తెలంగాణా ఎన్నికలపై స్పందించారు. చంద్రబాబు ను భస్మాసురుడు తో పోల్చి మాట్లాడారు. భస్మాసురుడు చేయి పెట్టినా …. మన చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదేనని, ఈ విషయం తెలంగాణా ఎన్నికల్ రిజల్ట్స్ తే దేశం మొత్తం అర్ధమైందని జగన్ అన్నారు.  

తెలంగాణా ఎన్నికల్లో గెలుపుపై యుద్ధం చేసింది… చంద్రబాబు నా లేక అయన తరుపు పచ్చ మీడియానా అని జగన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీఅరెస్ కు 34% ఓట్లు వస్తే, కాంగ్రెస్ కు 24%, టీడీపీకి 15% వచ్చాయని .. దీంతో టీఆర్ఎస్ అధికారం చెప్పడం జరిగిందని జగన్ అన్నారు. దాంతో కూటమి ఏర్పాటు చేసుకొంటె ఓట్ల శాతం పెరుగుతుందని.. దాంతో గెలుపు ఖాయమౌతోందని అంచనా వేసుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక అసలుకే భంగం కలిగిందని వ్యాఖ్యానించారు. వారి ఆలోచన అనైతకమని… వారి పొత్తు అపవిత్రమని తెలుసుకున్న ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. తెలంగాణా ప్రజలు విజ్ఞత కలిగిన వారని జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి అవకాశవాద రాజకీయాలు చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ చేసిన  జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారని జగన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here