ఎన్నికల గుర్తు… ఇది రాజ‌కీయ పార్టీల అస్థిత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఒక్కో గుర్తు వెనుక ఓ చ‌రిత్ర ఉంటుంది. అయితే ఈ గుర్తులు ఎప్పటి నుంచో పాగా వేసిన  జాతీయ పార్టీలకు బాగానే ఉన్నా.. ప్రాంతీయ పార్టీలకు మాత్రం  గత ఎన్నికల్లో చాలా కష్టాలు తెచ్చిపెట్టాయి. గెలుపోటములు నిర్ధేశించేవిధంగా మారి   అభ్యర్ధుల జీవితాలనే తారుమారు చేశాయి.

 • పార్టీ గుర్తు ప్రజల్లోకి వెళ్ళడం ప్రధానం
 • ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో గుర్తు ఒకటి
 • గుర్తు ఆధారంగా ఓట్లు వేసే సాంప్రదాయం
 • రాష్ట్ర పార్టీలను ముప్పతిప్పలు  పెట్టిన గుర్తు
 • స్వతంత్ర్య అభ్యర్ధులకు రాష్ట్ర పార్టీ గుర్తును పోలి ఉండే గుర్తులు

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్ధుల‌కు గెల‌వ‌డం  ఎంత ముఖ్యమో.. త‌న పార్టీ గుర్తు ప్రజ‌ల్లోకి వెళ్ళడం అంత కంటే ముఖ్యం. ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో గుర్తు ఒకటి . ఓట‌ర్లు … అభ్యర్ధి ఎవ‌రు అనే దానికంటే  గుర్తు ఆధారంగా ఓట్లు వేసే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఈ విషయంలో  జాతీయ పార్టీల‌కు ఈ గుర్తులు…  పెద్దగా ఇబ్బందులు పెట్టకపోయినా… రాష్ట్ర పార్టీలను మాత్రం  ముప్పతిప్పలు పెట్టాయి.

 • రాష్ట్రంలో రిజిష్టరైన పార్టీలు 41
 • స్వతంత్ర అభ్యర్థుల కోసం 162 గుర్తులు

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గుర్తింపుపొందిన పార్టీలు, జాతీయ పార్టీలు మినహా రిజిష్టర్‌ అయిన పార్టీలు 41 ఉన్నాయి. ఇందులో కొత్తగా వచ్చిన జనసమితికి అగ్గిపెట్టె, బీఎల్పీకి రైతు నాగలి వంటి గుర్తులు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థుల కోసం 162 గుర్తులను ఎంపిక  చేసింది ఈసీ. అంతకు ముందు స్వతంత్ర్య అభ్యర్ధుల‌కు రాష్ట్రపార్టీలను పోలి ఉండే గుర్తులను ఇవ్వడంతో ప్రధాన అభ్యర్ధుల విజ‌యావకాశాలపై తీవ్రంగా దెబ్బ ప‌డింది.

 • టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మంద జగన్నాథం
 • 17 వేల ఓట్లతో తేడాతో ఓటమి
 • కారును పోలిఉన్న ఆటో, క్యాప్గుర్తులు
 • క్యాప్గుర్తుకి  ఏకంగా 54,680 ఓట్లు

2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కొందరికి ఆటో, క్యాప్‌ గుర్తులను కేటాయించారు. ఇది కారు గుర్తును పోలి ఉండటంతో వీటికి భారీగా ఓట్లు పడ్డాయి. నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మంద జగన్నాథం 17 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.  ఆటో , క్యాప్‌ గుర్తులు కారును పోలి ఉండటంతో.. గ్రామీణ ప్రాంతంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థికి  కేటాయించిన ఆటోకు వేసినట్టు తెలిసింది. ఆ అభ్యర్థి ఎలాంటి ప్రచారం చేయక‌పోయినా క్యాప్‌ గుర్తుతో  ఏకంగా 54,680 ఓట్లు పడటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి అవాక్కయ్యారు.

 

 • నర్సంపేట నుంచి  దొంతి మాధవరెడ్డి   ఇండిపెండెంట్గా గెలుపు
 • స్వతంత్ర్య అభ్యర్ధిగా  ఆటో గుర్తుపైనే గెలుపు
 • కంచర్ల భూపాల్రెడ్డికి 50 వేల ఓట్లు
 • సంకినేని వెంకటేశ్వర్రావుకు 41 వేల ఓట్లు
 • ఆటో గుర్తు పొందిన రచ్చయ్యకు 1,768 ఓట్లు
 • చేవేళ్లలో పోటీ చేసిన అభ్యర్థికి 3,719 ఓట్లు
 • టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నం కేవలం 761 ఓట్లతో ఓటమి

ఇక నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి ఆటో గుర్తుపైనే గెలిచారు. నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్‌రెడ్డికి 50 వేల ఓట్లు, సూర్యాపేటలో మంత్రి జ‌గ‌దీష్  రెడ్డి  చేతిలో ఓడిపోయిన  సంకినేని వెంకటేశ్వర్‌రావుకు 41 వేల ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో ఆటో గుర్తు పొందిన రచ్చయ్యకు 1768 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి 842 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చేవేళ్లలో ఆటో గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 3వేల 719 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నం కేవలం 761 ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఆటో గుర్తు కారణంగా నష్టపోయిన విధానాన్ని వివరిస్తూ టీఆర్ఎస్ సీఈసీకి లేఖ  రాసింది.

దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ ఆటోతో పాటు టోపీ గుర్తులను తొలిగించింది. మ‌రో వైపు ఏపీలోని అధికార టిడిపి సైతం ప‌లు స్వతంత్ర గుర్తుల పై అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో సైకిలుతో పోలివున్న  ఫ్రీ సింబల్స్ నుంచి బైక్‌ను కూడా తొలిగించిన‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే ఇటు తెలంగాణలో, అటు ఏపీలోని  అధికార పార్టీకి చాలా ప్రయోజ‌నం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here