ఆనాడు మన ప్రాజెక్ట్ లకు అడ్డుపడాలని చుసిన నేతలు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు ఓట్లు కోసం వస్తున్నారో అర్ధం కావడం లేదని మంత్రి కేటీఅర్ అన్నారు. గెలుపు భయంతోనే వారంతా కూటమిగా ఏర్పడ్డారని ఎద్దేవా చేశారు.ప్రజలు వారికి బుద్ది చెప్పాలని కేటీఅర్ కోరారు.మంత్రి కేటీఅర్, నాగేశ్వరరావులు పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమలో పాల్గొన్న అయన రవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా కేటీఅర్ మాట్లాడుతూ.. కేవలం తెలంగాణా రాష్ట్రంలో పట్టుకోసమే ఈ అవకాశవద పొత్తులని, అధికార దాహం కోసమే ఈ అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. మన ప్రాజెక్ట్ లను ఎలాగైనా ఆపాలని సీతారాం ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు 30 ఉత్తరాలు రాసారని ఈ సందర్భంగా అయన ప్రజలకు గుర్తు చేశారు.ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్న రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు తధ్యమని ఆయన చెప్పారు.
నామినేషన్ పక్రియ పూర్తి చేసిన పిడపర్తి రవి కి మంత్రి కేటీఅర్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన్ను అత్యంత భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు.ఆనాడు కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన పార్టీలు ఓ గట్టున , ఆడకుండానే 24 గంటలు కరెంట్ అందించిన మన టీఆర్ఎస్ పార్టీ ఓ గట్టున ఉందన్నారు.మీరు ఏ గట్టున ఉంటారో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మన కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని… సత్తుపల్లికి గోదావరి నీళ్లు కావాలంటే మన పార్టీని మీరు గెలిపించాలన్నారు. మహా కూటమి సీట్లు పంచుకొనే లోపే మనం స్వీట్లు పంచుకుందామని మంత్రి కేటీఅర్ ప్రజలకు ఛలోక్తిని విసిరారు.ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని.. ఈ సారి తిరిగి మన టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here