జగన్ పాదయాత్రకు మద్దతుగా ప్రణయ్ ఆధ్వర్యంలో వందల బైకులతో కదిలిన వైస్సార్సీపీ శ్రేణులు.

జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.

ప్రతిపక్ష నేత వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శనివారం ఉరవకొండలో వైస్సార్సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఉరవకొండ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీగా చెప్పుకుంటున్న ఈర్యాలీని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే తనయుడు వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సందర్భంగా టవర్ క్లాక్ వద్ద జరిగిన సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న,దుర్మార్గపు, అధర్మపు పరిపాలనపై సమర శంఖారావమే జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు.. రాబోయే ఎన్నికల్లో పాలక పక్షాలను ఇంటికి పంపేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుని.. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై పోరాడేందుకే జగన్మోహన్ రెడ్డి పాద యాత్ర చేసారని పేర్కొన్నారు. 3 వేల 600 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైస్సార్సీపీ మ్యానిఫెస్టోలోని నవరత్నాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాధాన్యత వివరిస్తామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here