వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు హ‌త్య చేశారు? స‌క్ర‌మ‌మైన విచార‌ణ జ‌రిగితే తేలుతుంది. ఈ లోపే చంద్ర‌బాబు య‌ధావిథిగా త‌నకు అచ్చొచ్చిన విధానంలో శ‌వ‌రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. బాధితుల‌నే నిందితులను చేయ‌డానికి త‌న‌కు తెలిసిన విద్య‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హ‌త్యతో రాష్ట్ర వ్యాప్తంగా అల్ల‌ర్లు చెల‌రేగితే వైఎస్సార్ సీపీ క్యాడ‌ర్‌లోని ముఖ్య‌మైన‌వారిని, ముఖ్య‌మైన నేత‌ల‌ను అరెస్టు చేసి జైలుకి పంపించాల‌నే మ‌హాకుట్ర‌కు బీజం వేశారు. ఇప్ప‌టికే ఐటీ గ్రిడ్స్ స్కామ్ ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన‌వారి ఓట్ల‌ను ల‌క్ష‌లాదిగా తొల‌గించిన చంద్ర‌బాబు ఆ స్కామ్ బైట‌ప‌డ‌డంతో తాను ఆశించిన ల‌క్ష్యం ఆశించినంత మేర నెర‌వేర‌లేద‌నే ప్లాన్‌తో ఏం చేయాలా అని ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది బ‌లమైన‌ నేత‌లు టిడిపిని వ‌దిలిపెట్టి వెళ్లిపోయారు. ఆఖ‌రికి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత‌లు కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారు. నిత్యం చేరిక‌ల‌తో వైఎస్సార్ సీపీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. అన్ని స‌ర్వేలు వైఎస్ జ‌గ‌నే సీఎం అంటున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఏదైనా అవ‌కాశం కోసం గోతికాడి ….లాగా ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు వైఎస్ వివేకా హ‌త్య‌నుంచి ల‌బ్ధి పొంద‌డానికి నానా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.
వివేకా మ‌ర‌ణ వార్త తెలిసిన‌ప్పుడు ఏం జ‌రిగిందో చూద్దాం. ఎంతో సౌమ్యుడు, చీమ‌కు కూడా హాని చేయ‌ని వైఎస్ వివేకాను హ‌త్య చేస్తార‌ని ఎవ‌రూ భావించ‌లేదు. దాంతో కాసేపు ఏం జ‌రిగిందో తెలియ‌క వైఎస్ఆర్ సీపీ నేత‌లు ఇబ్బంది ప‌డ్డారు. చంద్ర‌బాబు నైజం తెలుసుక‌నుక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బాబు ఎంత‌కైనా తెగిస్తార‌నే విష‌యంపై అవ‌గాహ‌న వుంది క‌నుక, తొమ్మిదేళ్లుగా కుట్ర‌లు కుతంత్రాల‌ను చూస్తున్నారు క‌నుక… గెలిచే త‌రుణంలో ఆచితూచి అడుగులు వేయాల‌నే ఆలోచ‌న‌తో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు ఎంతో సంయ‌మ‌నం పాటించాయి. విశాఖ‌లో త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ త‌న పార్టీవారిని సంయ‌మ‌నం పాటించ‌మ‌ని కోరారు. ఎందుకంటే ఇప్ప‌టికే ఈ పోరాటాల కార‌ణంగా అన్ని విధాలా న‌ష్ట‌పోయి వున్న త‌న నేత‌లు, శ్రేణులు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నేది వైఎస్ జ‌గ‌న్ భావ‌న‌. అందుకే నాడు క‌త్తిదాడి స‌మ‌యంలోను, నేడు వైఎస్ వివేకా హ‌త్య త‌ర్వాత అదే హుందాను చూపారు. కానీ చంద్ర‌బాబుకు ఇది న‌చ్చ‌లేదు. వివేకా హ‌త్య జ‌రిగితే జ‌గ‌న్‌లో బాధ లేదు, కోపంతో నానా ర‌భ‌స చేసి పార్టీని నాశ‌నం చేసుకోలేదెందుకు? అనే అర్థం వ‌చ్చేలా మాట్లాడుతున్నారు. అంటే ఈ సారి కూడా త‌న ట్రాప్‌లో జ‌గ‌న్‌గానీ, ఆయ‌న పార్టీ నేత‌లుగానీ ప‌డ‌లేదు అనేది చంద్ర‌బాబు ఆవేద‌న‌. బాబు ఆవేద‌న‌ను ఎవ‌రు అర్థం చేసుకున్నా చేసుకోక‌పోయినా తెలుగు ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు శ‌వ‌రాజ‌కీయాల‌కు స‌మాధి క‌ట్టే కాలం ఎంత దూరంలో లేదు.

ఇక వైఎస్ వివేకా గురించి చివ‌ర‌గా ఒక మాట‌. ఆయ‌న మీడియాలో ప్ర‌చారంలో వుండ‌రుగానీ, జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాదించుకున్న మంచి మ‌న‌సున్న‌నేత‌. వైఎస్సార్ మార్గంలో న‌డుస్తూ ఎంతో మందికి సాయం చేసి త‌న చేతికి ఎముక లేదు అని నిరూపించుకున్న వ్య‌క్తి. అంతే కాదు జిల్లాలో అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌నే స్థిత‌ప్ర‌జ్ఞ‌త వున్న నేత‌. వైఎస్ జ‌గ‌న్‌కు తండ్రి త‌ర్వాత తండ్రిలాంటివాడు. ఈ సారి జ‌గ‌న్ సీఎం కావాల‌నే ఆకాంక్ష‌తో నిత్యం శ‌క్తి వంచ‌న‌లేకుండా ప‌ని చేస్తున్న నేత‌. ఆయ‌న‌ను అంత‌మొందిస్తే జ‌గ‌న్ బ‌ల‌హీనుడ‌వుతాడ‌నే కుట్ర ఇందులో వుంద‌నేది సీమ‌లోనే కాదు రాష్ట్ర రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న వున్న ప్ర‌తి ఒక్క‌రు చెబుతున్న విష‌యం. వైఎస్ వివేకా లేక‌పోవ‌డం వైఎస్ జ‌గ‌న్‌కు తీర‌ని లోటు. ఇది తెలుసుకాబ‌ట్టే వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఈ ఘోర‌మైన కుట్ర‌ప‌న్నారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో హ‌త్యారాజ‌కీయాల‌ను న‌మ్ముకున్నారు. విజ్ఞులైన ప్ర‌జ‌లు ఈ కుట్ర‌ల‌ను అర్థం చేసుకోవ‌డం ఖాయం. బాబు మార్కు కుట్ర‌లు, ద‌గాలు, వెన్నుపోటు రాజ‌కీయాలు, ప‌చ్చ మీడియా మాటు నీచాలను ప్ర‌జ‌లే అంత‌మొందిస్తారు.

-సి.ఆర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here