వైఎస్సార్ సీపీ ప్రవేశ పెట్టిన తొమ్మిది నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ మరియు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షులు బి.వై రామయ్య న్యాయకత్వాన్నీ బలపర్చాలనీ కోరుతూ మంగళవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో బి.వై రామయ్య ఆత్మీయులు విస్తృతంగా పర్యటించారు.రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం నవరత్నాలతోనే నాంది పలుకుతుందనీ వివరిస్తూ పర్యటనను విజయవంతం చేసుకున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయుకులు

ఈ సందర్భంగా స్థానిక నాయకులు రామకృష్ణ, రామన్న నాయుడు, రంగన్నలతో కలిసి ఆస్పరిలో పర్యటించిన బి.వై రామయ్య ఆత్మీయులు తలారి కృష్ణ నాయుడు, నల్లబోతుల ఉమా మహేష్, సాకే బైరేష్, రాజశేఖర్, నవీన్, రాముడు, గుడీసే సీతారాముడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో అభివృద్ధి సంక్షేమం మరచి‌, కేవలం ప్రచార ఆర్భాటానికే ప్రభుత్వం పరిమితం అయిందని, జిల్లాలో ఏ మూల చూసిన అవినీతి కంపు కొడుతుందన్నారు.త్వరలోనే ఈ ప్రభుత్వానికి స్వస్తి పలికి, రాజన్న రాజ్యం సాధించుకుందామన్నారు. తమ పర్యటన విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఇదేవిధంగా ఎన్నికల వరకు కష్టాపడాలనీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here