చంద్రబాబు సంగతి చూడటానికి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు వెనుకాడమని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తానేమీ చేశానని తిడుతున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబు నటిస్తున్నారని, ఓటుకు కోట్లు కేసులో ‘మనవాళ్లు బ్రీఫ్ట్ మీ’ అంటూ అడ్డంగా దొరకలేదా అని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆ గొంతు నాది కాదు అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. నందమూరి కుటుంబం రాజకీయజీవితాన్ని నాశనం చేయడానికే చంద్రబాబు నందమూరి సుహాసినికి ఓడిపోయే సీటు ఇచ్చారని పేర్కొన్నారు. ఆమెపై అంత ప్రేమ ఉంటే లోకేష్ లా ఏపీలో ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here